: ఆస్ట్రేలియా జట్టు మూడు రోజులుగా మోసం చేసింది: కోహ్లీ తీవ్ర ఆరోపణలు


ఆస్ట్రేలియా వ్యూహంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. పూణే టెస్టు ఓటమికి బెంగళూరు టెస్టుతో ప్రతీకారం తీర్చుకున్న అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, డీఆర్ఎస్ పేరుతో మూడు రోజులుగా ఆస్ట్రేలియా జట్టు మోసానికి పాల్పడిందని మండిపడ్డాడు. డీఆర్ఎస్ సిస్టమ్ ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం రివ్యూ సిస్టమ్ గా మార్చేశారని విమర్శించాడు. తమ బ్యాట్స్ మన్, బౌలర్లు ఆసీస్ వ్యూహాలను చిత్తుచేశారని తెలిపాడు. పట్టుదలతో ఆడి మ్యాచ్ లో విజయం సాధించి, సిరీస్ ను సమం చేశామని చెప్పాడు. మిగిలిన రెండు టెస్టుల్లో ఇదే విధంగా పట్టుదలతో ఆడుతామని కోహ్లీ తెలిపాడు. సవాళ్లను స్వీకరించి, అధిగమించడం తమకు ఇష్టమని కోహ్లీ చెప్పాడు. 

  • Loading...

More Telugu News