Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కన్నడ నటి అమూల్య నిశ్చితార్థం!

కన్నడ ప్రముఖ నటి అమూల్య త్వరలో పెళ్లి చేసుకోనుంది. రాజకీయ నాయకుడు, మాజీ కార్పొరేటర్ జీహెచ్ రామచంద్రన్ కుమారుడు జగదీష్ ఆర్ చంద్రతో ఆమె వివాహం మే నెలలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమూల్య, చంద్ర నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, 2001లో బాల నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమూల్య ఇప్పటి వరకు 20కు పైగా కన్నడ చిత్రాల్లో నటించింది. కన్నడ గోల్డెన్ క్వీన్ గా పేరు పొందిన అమూల్య ‘చైత్రదా చంద్రమా’, ‘నాను నన్న కససు’, ‘శ్రావణి సుబ్రహ్మణ్య’, ‘గజకేసరి’ వంటి చిత్రాల్లో నటించింది. ‘శ్రావణి సుబ్రహ్మణ్య’ చిత్రంలో ఆమె నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు లభించింది.

More Telugu News