: ఎంతో కష్టపడుతున్న లోకేష్... అందుకే ఎమ్మెల్సీ సీటు: బాలకృష్ణ


తెలుగుదేశం పార్టీ కోసం నారా లోకేష్ ఎంతో కష్టపడుతున్నారని, ఆయన చేస్తున్న కృషికి దక్కిన ప్రతిఫలమే ఎమ్మెల్సీ స్థానమని టీడీపీ నేత, నటుడు బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి లోకేష్ నామినేషన్ వేసేందుకు వచ్చిన వేళ, ఆయన వెంటనే ఉన్న బాలయ్య, మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం శ్రమించేవారికి ఎప్పటికైనా పదవులు దక్కుతాయని అన్నారు. ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ కు మరిన్ని అవకాశాలు దగ్గర కానున్నాయని అన్నారు. లోకేష్ సేవలను పార్టీ మరింతగా వినియోగించుకుంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News