: డైరెక్షన్ తప్పకుండా చేస్తా.. అయితే ఎప్పుడో చెప్పలేను!: మాస్ మహారాజా రవితేజ
ఇటీవలే ట్విట్టర్‌లో ఖాతా తెరిచిన మాస్ మహారాజా రవితేజ తనకు సమయం దొరికినప్పుడు తన అభిమానులతో చాటింగ్ చేస్తూ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు. ఈ క్రమంలో, తాజాగా ఓ అభిమాని ఆయనను డైరెక్షన్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అని అడిగాడు. దానికి స్పందించిన రవితేజ తప్పక చేస్తానని, అయితే, తాను ఆ అవతారం ఎప్పుడు ఎత్తుతానో తెలియదని చెప్పాడు. రవితేజ నటుడిగా గుర్తింపు తెచ్చుకోకముందే డైరెక్షన్ డిపార్టుమెంట్ లో పని చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా వెండితెరపై దర్శనమివ్వని రవితేజ ఈ మధ్య దూకుడు పెంచి 'టచ్ చేసి చూడు', 'రాజా ది గ్రేట్' అనే రెండు సినిమాలు చేస్తున్నాడు.
Definitely untundi, kani yepudu telidu https://t.co/Ntq1VOOQ4W
— Ravi Teja (@RaviTeja_offl) 3 March 2017