: విభేదాలు పక్కన పెట్టి విజయం కోసం పాటుపడండి: టీడీపీ నాయకులకు చంద్రబాబు ఆదేశం


విజయనగరం జిల్లాలోని కురుపాం, సాలూరు టీడీపీ నేతలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు పాటు పడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయనగరం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించకపోతే, వారి ముఖాలు చూసే ప్రసక్తి ఉండదని అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సభ్యులపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News