: టీవీ ఇంటర్వ్యూలో అధికారులపై ఆరోప‌ణ‌లు చేసిన ఆర్మీ జ‌వాను అనుమానాస్పద మృతి!


టీవీ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త‌మ అధికారులపై ఆరోప‌ణ‌లు చేసిన ఓ ఆర్మీ జ‌వాను అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందడం అల‌జ‌డి రేపుతోంది. నాసిక్‌లోని తన క్యాంపు సమీపంలో నిన్న రాయ్ మాథ్యూ (33) అనే జ‌వాను మృతదేహం క‌నిపించింది. తన‌ను సీనియర్లు వేధిస్తున్నారని, అంతేగాక‌, పనిచేసే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయ‌న ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నాడు. అనంత‌రం కొల్లాంలో ఉన్న తన భార్యకు ఫోన్ చేసిన ఆ జ‌వాను తాను ఏదో పెద్ద తప్పు చేశానని కూడా చెప్పాడు.

అయితే, గ‌త‌ నాలుగు రోజుల నుంచి ఆయ‌న క‌నిపించ‌డం లేదు. త‌న భ‌ర్త‌ ఆచూకీ దొరకలేదని రాయ్ భార్య ఫినీ మాథ్యూ చెప్పారు. ఈ క్రమంలో ఆయన మృతదేహం బయటపడింది. ఆ జ‌వాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆ జ‌వాను కుటుంబ సభ్యులు మాత్రం ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని అంటున్నారు.

  • Loading...

More Telugu News