: హమ్మయ్య! లావాదేవీలపై ఊరటనిచ్చే ప్రకటన చేసిన బ్యాంకులు
నాలుగు లావాదేవీలు దాటితే ఆ తర్వాత జరిపే ఒక్కో లావాదేవీకి రూ.150 బాదేస్తామంటూ ప్రకటించి ప్రజలను బెంబేలెత్తించిన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు తాజాగా మరో ప్రకటన చేసి ఈ విషయంలో స్పష్టత నిచ్చాయి. ఈ ఆంక్షలన్నీ బ్యాంకుల్లో జరిపే లావాదేవీలకే వర్తిస్తాయని, ఏటీఎంలలో జరిపే లావాదేవీలకు వర్తించవంటూ ఊరటనిచ్చే ప్రకటన చేశాయి. నగదు డిపాజిట్ చేసే మిషన్లలో ఎన్నిసార్లు అయినా ఉచితంగానే జమ చేసుకోవచ్చని తెలిపాయి. బుధవారం నాటి బ్యాంకుల ప్రకటనలో ఏటీఎంలలో లావాదేవీలపై స్పష్టత లేకపోవడంతో బ్యాంకు అధికారులు ఈ విషయంలో మరో ప్రకటన జారీ చేశారు. సీనియర్ సిటిజన్లు, మైనర్ల ఖాతాల లావాదేవీలపైనా ఎలాంటి పరిమితులు ఉండవని వారు స్పష్టం చేశారు.