Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవిత భాగస్వామితో తేడా ఉంటే.. డిప్రెషన్‌ తప్పదు

దంపతులంటే.. తుదిశ్వాస వరకు ఇద్దరూ ఒక్కటిగా మనవలసిన జీవితం అని మన ధర్మం చెబుతుంది. పరస్పర సహకారం, సయోధ్య ఉన్న జీవిత భాగస్వాముల కుటుంబాలు కూడా ఆనందదాయకాలుగానే ఉంటాయి. అయితే ఇదే జీవిత భాగస్వాముల దన్ను సరిగా లేని వారికి డిప్రెషన్‌ తప్పదని అధ్యయనాలు చెబుతున్నాయి. మనకు ఉండే వ్యక్తిగత సంబంధ అనుబంధాలను బట్టి ముందుముందు డిప్రెషన్‌ను అంచనా వేయొచ్చని మిచిగన్‌ హెల్త్‌ సిస్టం యూనివర్సిటీ వారు గుర్తించారు.

అన్యోన్యంగా జీవించే దంపతులతో పోలిస్తే.. చికాకులు ఉన్న దంపతుల్లో ఒకరికి డిప్రెషన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువట. అలాగే ఇతరులతో సంబంధాలు నెరపడంలోనూ దీని మూలాలుంటాయి. సంబంధాలు అంతంత మాత్రం ఉన్నవారికి ముప్పు రెట్టింపు అవుతున్నట్లు అధ్యయనం చెబుతోంది. ఇతరులతో ఉండే వ్యక్తిగత సంబంధాలకు, డిప్రెషన్‌కు లింక్‌ ఉన్నట్లు నిరూపణ కావడం ఇదే తొలిసారి అని.. అధ్యయనానికి సారథ్యం వహించిన ఆలన్‌ టియో చెబుతున్నారు.

More Telugu News