: విచిత్రం... రైల్వే గేటును తన తొండంతో ఎత్తి.. పట్టాలు దాటి వెళ్లిపోయిన ఏనుగు!


రైలు వస్తోందని సిబ్బంది రైల్వే గేటు వేసేశారు. అయితే, ఆ రైల్వే గేటును తన తొండంతో ఎత్తి పట్టాలు దాటి వెళ్లిపోయింది ఓ ఏనుగు. పశ్చిమబెంగాల్‌లోని ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌ అటవీశాఖ ఉద్యోగులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం నుంచి తప్పించుకున్న స‌ద‌రు గ‌జ‌రాజు రైల్వే గేట్ వద్దకు వచ్చింది. త‌న‌ను అధికారులు మ‌ళ్లీ ప‌ట్టుకుని బంధిస్తారేమోన‌ని ప‌రుగులు తీస్తూ కంగారు ప‌డింది.

తొండంతో ఒక్కసారిగా రైల్వేగేట్‌ను పైకెత్తి, తను అటుగా వెళ్లి, తిరిగి జాగ్రత్తగా గేట్‌ను ఉన్న స్థానంలో ఉంచేసి రైలు ప‌ట్టాలు దాటేసింది. దీనిని చోద్యం చూసిన అక్కడి ప్రజలు, సిబ్బంది ఏనుగుకి ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఆ ఏనుగు ఇప్ప‌టికీ అటవీశాఖ వారికి దొర‌క‌లేదు. దాని కోసం ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News