: నేతలతో చంద్రబాబు కీలక భేటీ

తనకు అందుబాటులో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలతో అమరావతి నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో, అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన చంద్రబాబు, తుదిసారిగా మరోసారి చర్చించి, అధికారికంగా టీడీపీ తరపున పోటీ చేసే వారి పేర్లను ప్రకటించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కాగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఈ నెల 28తో గడువు ముగుస్తుందన్న సంగతి విదితమే. ఎమ్మెల్యే కోటాలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, నామినేషన్లకు మార్చి 7 వరకూ గడువుంది. ఇక ఎమ్మెల్యే కోటా స్థానాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 7 స్థానాల్లో తెలుగుదేశం 5, వైకాపాకు ఒక్క స్థానం ఖాయం కాగా, ఏడో స్థానానికి రెండో ప్రాధాన్యతా ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో ఏడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపే అంశాన్ని తెలుగుదేశం పరిశీలిస్తోంది.

More Telugu News