: గాడిదలు, పక్షులు, కసబ్ లు... యూపీ ఐదో దశ ప్రచారంలో హీనస్థితికి నేతల నోటి మాటలు!
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, అధికారాన్ని నిలుపుకోవాలని సమాజ్ వాదీ, తిరిగి సత్తా చాటాలని బీఎస్పీ గట్టి పట్టుతో ఉండటంతో, త్రిముఖ పోటీ జరుగుతున్న వేళ, నేతల విమర్శల తూటాలు హద్దులు దాటి మరింత హీన స్థితికి చేరాయి. ఎన్నికల ప్రచారంలో నేతలు తమ నోటికి అడ్డూ అదుపు లేనట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నెల 27న మొత్తం 11 జిల్లాల్లోని 51 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.
బహరైచ్ ప్రాంతంలో జరిగిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ను గాడిదతో పోలుస్తూ, ప్రధాని విమర్శించిన తరువాత, ప్రచారంలో విమర్శల వేడి మరింతగా పెరిగింది. అంతకుముందు గుజరాత్ గాడిదల కోసం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన వద్దని బిగ్ బీ అమితాబ్ కు అఖిలేష్ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మాటల తూటాలు అక్కడితో ఆగలేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, అమిత్ షాను ముంబై ఉగ్రదాడుల్లో పాల్గొని ఉరి వేయబడ్డ కసబ్ తో పోల్చారు. అమిత్ షా ఓ టెర్రరిస్టు వంటి వాడని అన్నారు.
ఇక అఖిలేష్ అయితే అమిత్ ను పావురంతో పోల్చారు. యూపీ నుంచి బీజేపీ పావురం ఎగిరిపోనుందని అన్నారు. ఇక తమ నేతలే ఈ తరహా విమర్శలకు దిగడంతో, కిందిస్థాయి నేతలు ప్రత్యర్థులపై మరింతగా విరుచుకుపడుతున్నారు. కాగా, మలిదశలో గోండా, ఫజియాబాద్, బలరాంపూర్ అంబేద్కర్ నగర్, బహరైచ్, శరావస్తి, సిద్ధార్థ నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, అమేథి, సుల్తాన్ పూర్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. 2012లో జరిగిన ఎన్నికల్లో ఈ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో (సమాజ్ వాదీ అభ్యర్థి మరణించిన కారణంగా అలాపూర్ నియోజకవర్గం పోలింగ్ మార్చి 9కి మార్చబడింది) సమాజ్ వాదీ 37 సీట్లను గెలుచుకోగా, బీజేపీ, కాంగ్రెస్ లు తలో 5, బీఎస్పీ మూడు సీట్లను, పీస్ పార్టీ రెండు సీట్లను గెలుచుకున్నాయి. ఈ దఫా ఎన్నికలు జరగనున్న పలు జిల్లాల్లో సమాజ్ వాదీ బలంగా కనిపిస్తోంది. అత్యధికంగా 24 మంది అమేథిలో పోటీ పడుతుండగా, కపిల్ వస్తు, ఎత్వా నియోజకవర్గాల్లో కేవలం ఆరుగురు చొప్పున బరిలో ఉన్నారు.