: అమ్మకానికి డొనాల్డ్ ట్రంప్ పాత కారు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన క్యాడిల్లాక్ లిమోసిన్ కారు అమ్మకానికి సిద్దంగా ఉంది. 1988లో ఈ కారును ట్రంప్ కొన్నారు. అప్పుడు ఆయన వయసు 42 ఏళ్లు. ఎంతో విశాలంగా ఉండే ఈ కారులో ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. అప్పట్లో ఈ కారును ట్రంప్ కోసం క్యాడిలాక్ ప్రత్యేకంగా తయారు చేసింది. అయితే, ఈ కారుకు ప్రస్తుత ఓనర్ ట్రంప్ కాదు. బ్రిటన్ లోని గ్లూసెస్టర్ లో ఈ భారీ కారును వేలం వేయనున్నారు. ఈ కారులో అన్ని ఒరిజినల్ ఫిట్టింగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఈ కారు సమారు 42 లక్షల వరకు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.