: పదవీబాధ్యతలు స్వీకరించి, ఐదు కీలక దస్త్రాలపై సంతకాలు చేసిన పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలోనూ నెగ్గిన విషయం తెలిసిందే. దీంతో కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర సచివాలయానికి వచ్చిన ఆయన.. మొదట అక్కడ అమ్మ జయలలిత ఫొటో వద్ద నివాళులర్పించారు. అనంతరం పదవీబాధ్యతలు స్వీకరించి, ఐదు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రారంభించారు. మహిళలకు 50 శాతం రాయితీతో ద్విచక్రవాహనాలను అందించే పత్రాలపై సంతకం చేశారు. రాష్ట్రంలోని 500 మద్యం దుకాణాల మూసివేత దస్త్రంపై, మహిళల ప్రసూతి సాయాన్ని రూ.12000 నుంచి 18000 వరకు పెంచే దస్త్రంపై సంతకాలు చేశారు. నిరుద్యోగ యువతకు ఇచ్చే నెలసరి భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
TNCM signed in 5 important files. #TNCM
— AIADMK (@AIADMKOfficial) 20 February 2017
50℅ subsidy for working women to buy two wheeler.#TNCM
— AIADMK (@AIADMKOfficial) 20 February 2017