: సండేని ఫుల్ గా ఎంజాయ్ చేసిన సమంత!
చెన్నై బ్యూటీ సమంత నిన్నటి సండేని ఎంతో ఎంజాయ్ చేసింది. నిన్న తాను ఇలా గడిపానంటూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో సమంత తన కుక్కపిల్లను గట్టిగా హత్తుకుని ఉంది. మరోవైపు నాగచైతన్య వెనుక కుర్చీలో కూర్చొని ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఈ ఫొటో ఆమె అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. విపరీతంగా లైకులు కొడుతూ షేర్ చేస్తున్నారు. ఎవరికి తోచిన కామెంట్ వారు చేస్తున్నారు. ఇటీవలే చైతూ, సమంతలకి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.