: రెండు ప్రత్యేక విమానాల్లో రేపు ఏపీకి కేసీఆర్
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి చెల్లించాల్సిన మొక్కు చెల్లించుకుని, ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను సమర్పించుకునేందుకు రెండు ప్రత్యేక విమానాల్లో కేసీఆర్ రేపు ఏపీకి రానున్నారు. తన కుటుంబ సభ్యులు, పలువురు మంత్రులు, వారి కుటుంబీకులతో కలసి మంగళవారం సాయంత్రం రేణిగుంటకు చేరుకునే కేసీఆర్ బృందం రాత్రికి విశ్రమించి, బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు శ్రీకృష్ణ, శ్రీవత్సం విశ్రాంతి గృహాల్లోను, మంత్రులకు, ఇతరులకు శ్రీ, లీలావతి, మణిమంజరి, టీఎస్ఆర్ గెస్టు హౌస్ లలోను బస ఏర్పాట్లు చేసినట్టు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించినందుకు రూ. 5 కోట్లతో కేసీఆర్ బంగారు ఆభరణాలను తయారు చేయించిన సంగతి తెలిసిందే.