: చిన్నమ్మకు ఇబ్బందులు లేకుండా... చెన్నై జైలుకు తరలించాలని రేపు పిటిషన్


అధికారం చేతుల్లోకి వచ్చింది. బల నిరూపణ కూడా ముగిసింది కాబట్టి పళనిస్వామి వర్గానికి ఇప్పట్లో వచ్చిన చిక్కేమీ లేదు. ఇక తమ చిన్నమ్మను కర్ణాటక జైలు నుంచి తమ రాష్ట్రానికి తీసుకువచ్చేలా చూసేందుకు కదలనుంది పళని ప్రభుత్వం. ఈ మేరకు రేపు హైకోర్టులో శశికళ న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆమె మధుమేహం, మోకాలి సమస్యలతో బాధపడుతున్నారని, మిగిలిన శిక్షా కాలాన్ని వేలూరు లేదా చెన్నై కేంద్ర కారాగారంలో అనుభవించేలా అనుమతించాలని న్యాయవాదులు కోరనున్నారు.

ఇక తమిళనాడులో శశికళ వర్గానికే అధికారం దక్కడం, అన్నాడీఎంకే వర్గాలు పరప్పన అగ్రహార జైలుకు వెల్లువెత్తే అవకాశాలు ఉండటం, భద్రతా పరమైన సమస్యలు తలెత్తే వీలుండటం తదితర కారణాలతో కర్ణాటక సైతం తమకెందుకులే అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున పార్టీ వర్గాలు శశికళ ఆశీస్సులకు, మంతనాలకు జైలుకు వచ్చే అవకాశాలు ఉండటంతో ఆమెను సాధ్యమైనంత త్వరగా తమిళనాడుకు పంపితేనే మంచిదని కన్నడ సర్కారు యోచిస్తున్నందున త్వరలోనే చిన్నమ్మ జైలు మారడం ఖాయమని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News