: తమిళనాడు రాజకీయాలపై వివాదాస్పద ట్వీటు చేసి విమర్శలు ఎదుర్కుంటున్న మాజీ క్రికెటర్‌


ఓ వైపు తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల దృష్ట్యా అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు కనిపిస్తుంటే, మ‌రోవైపు అదే రాష్ట్ర రాజ‌కీయాల‌పై వివాదాస్పద ట్వీటు చేసి భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గుర‌య్యారు. సాధార‌ణంగా త‌న‌కు ఆ రాష్ట్ర‌ రాజకీయాలపై ఆసక్తి లేదని, తమిళ రాజకీయనాయకుల పేర్లు చాలా క్లిష్టంగా ఉంటాయని వ్యంగ్యంగా ఆయ‌న ట్వీటు చేశారు. దీంతో ఆ ట్వీటు చూసిన‌ నెటిజన్లు కామెంటరీ చెప్పే ఓ వ్య‌క్తికి ఆ పేర్లు పలకడం రాదా? అంటూ మండిప‌డుతున్నారు. దక్షిణ ప్రాంతాల్లో ప్రజల భాష‌ల గురించి అస‌లు మీకు తెలుసా? అని ప‌లు ర‌కాల ప్ర‌శ్న‌ల‌తో ఆయ‌న‌ను విమ‌ర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News