: చిరిగిన చొక్కాతో గవర్నర్ వద్దకు బయల్దేరిన స్టాలిన్
అసెంబ్లీ నుంచి చిరిగిన చొక్కాతోనే డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్ రావు వద్దకు బయల్దేరారు. అంతకు ముందు అసెంబ్లీ వద్ద ఆయన మాట్లాడుతూ, మార్షల్స్ దాడిలో తమ ఎమ్మెల్యేలు కొందరు గాయపడ్డారని చెప్పారు. సభలో తనను కూడా మార్షల్స్ కొట్టారని తెలిపారు. అసెంబ్లీలో జరిగిన దారుణాలన్నింటినీ గవర్నర్ కు వివరిస్తామని చెప్పారు. స్పీకర్ పట్ల తమ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును ఆయన తప్పుబట్టారు. అయితే, స్పీకర్ తన చొక్కాను తానే చింపుకుని, డీఎంకే ఎమ్మెల్యేలపై అపవాదు వేస్తున్నారని చెప్పారు.