: నాకు కాదు.. దేశ ప్ర‌జ‌ల‌కు శత్రువు: మీడియాపై మరోసారి మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్‌


మీడియాపై ఎల్ల‌ప్పుడూ మండిప‌డే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తాజాగా త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా న్యూయార్క్‌ టైమ్స్‌, ఎన్‌బీసీ న్యూస్‌, ఏబీసీ, సీబీఎస్‌, సీఎన్‌ఎన్‌ మీడియా సంస్థల పేర్ల‌ను ప్రస్తావిస్తూ మ‌రోసారి ఫైర్ అయ్యారు. ‘ఫేక్‌ న్యూస్‌ మీడియా.. నాకు కాదు అవి అమెరికా ప్ర‌జ‌ల‌కే శత్రువులు’ అని పేర్కొన్నారు. తాజాగా ట్రంప్ ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో ఉన్న తన క్లబ్‌ మార్‌-ఎ-లాగోకు వెళ్లారు. అక్క‌డి నుంచే ఈ ట్వీట్ చేశారు. తాను సాధించిన‌ విజయాల పట్ల మీడియా సరైన గౌరవం ఇవ్వట్లేదని వాపోయిన ట్రంప్‌... తనకు వ్యతిరేకమైన అంశాలను మాత్రం మీడియా ప్ర‌ధానంగా చూపుతోంద‌ని ఆరోప‌ణ‌లు గుప్పించారు. తాను నిర్వ‌హించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌ కు కూడా సరైన కవరేజ్‌ ఇవ్వలేదని ఆయ‌న మండిప‌డ్డారు. మీడియాకి నిజాయతీ లేద‌ని అన్నారు. ట్రంప్‌ ప్రభుత్వంలోని అడ్మినిస్ట్రేషన్‌ సమస్యలను మీడియా తెలియజేయడంపై కూడా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.



  • Loading...

More Telugu News