: మోదీ ప్రభుత్వం మంచి పని చేస్తోంది: ఫేస్‌బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌ ప్రశంస


భారత‌ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సోష‌ల్ మీడియాలో ఎంత‌గా యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అమెరికా అధ్య‌క్షుడికి శుభాకాంక్ష‌లు చెప్పడం నుంచి మ‌న‌ దేశ ప‌రిస్థితుల వ‌ర‌కు ప్ర‌తి అంశంపై ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా త‌న స్పంద‌న తెలియ‌జేస్తారు. ఈ అంశంమే ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ను సైతం ఆకర్షించింది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల మధ్య జవాబుదారీతనాన్ని పెంచేందుకు మోదీ స‌ర్కారు ఫేస్‌బుక్‌ను అద్భుతంగా వినియోగించుకుంటోంద‌ని ఆయ‌న అన్నారు. ‘బిల్డింగ్‌ గ్లోబల్‌ కమ్యూనిటీ’ పేరుతో 200 కోట్ల మంది తమ సైట్ వినియోగ‌దారుల‌ను ఉద్దేశిస్తూ ఆయ‌న రాసిన పోస్టులో మోదీ ప్ర‌స్తావ‌న తెచ్చారు.
 
ఎన్నికల్లో గెలిచాక చేతులు దులుపుకోవటం కాదని, ఐదేళ్లపాటు వారితో నేరుగా అనుసంధానమై ఉండాలని పేర్కొన్న జుక‌ర్ బ‌ర్గ్ ఈ విష‌యంలో మోదీ ప్ర‌భుత్వం ముందుంద‌ని చెప్పారు. మోదీ త‌మ‌ సమావేశాల వివరాలు, ఇతర సమాచారం ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలకు చేరాలని మంత్రుల‌ను కోరారని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News