: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్: సీఐఏ మాజీ అధికారి
యావత్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశం పాకిస్థాన్ అని సీఐఏ మాజీ చీఫ్ కెవిన్ హల్ బర్ట్ అన్నారు. రోజురోజుకూ విఫలమవుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ఉగ్రవాదం, శరవేగంగా పోగవుతున్న అణ్వాయుధాలు ఆ దేశాన్ని ముప్పు వైపుగా తీసుకెళుతున్నాయని ఆయన తెలిపారు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే... దాని ప్రభావం మొత్తం ప్రపంచంపై పడుతుందని చెప్పారు. పాకిస్థాన్ ను నియంత్రించడానికి కొన్ని చర్యలు ఉన్నాయని చెప్పిన ఆయన... ఆ దేశాన్ని ఒంటరిని చేయడం లేదా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు మరింత క్షీణిస్తాయని తెలిపారు.
పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే భయంతోనే... అమెరికా అధ్యక్షులు ఆ దేశానికి బిలియన్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని చెప్పారు. పాక్ ను మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే ఉన్నాయని... కానీ, ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు.