: దీపక్ ను పక్కనబెట్టి, సీఎంగా పళనిస్వామి పేరు ప్రకటించిన శశికళ!
తమ వర్గం తరఫున సీఎం అభ్యర్థిగా పళనిస్వామి పేరును శశికళ ప్రకటించినట్టు తెలుస్తోంది. రేసులో సెంగొట్టయ్యన్, తంబిదొరై పేర్లు తొలుత, ఆపై నేడు అనూహ్యంగా జయలలిత మేనల్లుడు దీపక్ పేరు తెరపైకి వచ్చినప్పటికీ, శశికళ నోటి వెంట పళనిస్వామి పేరు వచ్చింది. ఈ విషయమై గోల్డెన్ బే రిసార్టులోని ఎమ్మెల్యేల నుంచి మీడియాకు సమాచారం అందింది. ప్రస్తుతం రహదారులు, ఓడరేవుల మంత్రిగా ఉన్న పళని స్వామి అయితే, తనకు అనుకూలంగా ఉంటారని శశికళ ఓ నిర్ణయానికి వచ్చిన తరువాతనే ఆయన పేరును ప్రకటించి, అందరూ ఆయనకు అండగా ఉండి, పార్టీని విడిపోకుండా చూడాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మరింత సమాచారం తెలియాల్సివుంది.