: వంశీరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన సుష్మా స్వరాజ్
అమెరికాలోని కాలిఫోర్నియాలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్ కు చెందిన వంశీరెడ్డి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఫోన్ లో పరామర్శించారు. జరిగిన ఘటన చాలా బాధాకరమని ఈ సందర్భంగా ఆమె అన్నారు. వంశీ మృత దేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. వంశీ మృతికి కారణమైన వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వంశీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.