: రిసార్ట్ లో ఎమ్మెల్యేలతో చిన్నమ్మ మళ్లీ మంతనాలు!


కాంచీపురం జిల్లాలోని  గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న తన ఎమ్మెల్యేలను శశికళ  రెండో రోజూ కలిశారు. కొంచెం సేపటి క్రితం అక్కడికి చేరుకున్న ఆమె, ప్రస్తుత పరిస్థితులపై వారితో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ, రాజకీయాల్లో ఒక మహిళ కొనసాగడం చాలా కష్టమని, ఇటువంటి కష్టాలు ఎన్నింటినో జయలలిత అధిగమించారని, అలాగే, తాము కూడా ఈ సవాళ్లను అధిగమిస్తామని, తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తి పదవీ కాలం కొనసాగుతుందని ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో ఆమె ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News