: పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన మరో ఎంపీ


పన్నీర్ సెల్వం కు ఊహించని స్థాయిలో తమ పార్టీ నేతల మద్దతు లభిస్తోంది. పన్నీర్ సెల్వం గూటికి మరో ఎంపీ చేరారు. తిర్పూర్ ఎంపీ సత్యభామ తన మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వం నివాసానికి వెళ్లిన ఆమె తన మద్దతు ఆయనకు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జయలలిత అభీష్టానికి వ్యతిరేకంగా శశికళ పార్టీని నడిపిస్తున్నారని, జయ దూరం పెట్టిన వాళ్లను, ఆమె మరణం తర్వాత శశికళ పార్టీలోకి తీసుకొచ్చారని అన్నారు. సత్యభామ చేరికతో పన్నీర్ కు ముగ్గురు ఎంపీల మద్దతు లభించినట్లు అయింది. 

  • Loading...

More Telugu News