: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన విజయ్, పుజారా... స్కోరు పెంచే దిశగా టీమిండియా!


ఓపెనర్ కేఎల్ రాహుల్ 2 పరుగులు మాత్రమే చేసి విఫలమైనా, మరో ఓపెనర్ పుజారా, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ లు నిలదొక్కుకుని చెరో హాఫ్ సెంచరీ సాధించడంతో, బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించే దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. బంగ్లాదేశ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో లంచ్ తరువాత భారీ షాట్లకు దిగారు భారత ఆటగాళ్లు. ప్రస్తుతం భారత స్కోరు 40 ఓవర్లలో 127/1 కాగా, పుజారా 56, మురళీ విజయ్ 64 పరుగులతో ఆడుతున్నారు. బంగ్లా బౌలర్లలో తక్సీన్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది.

  • Loading...

More Telugu News