: అది అన్నాడీఎంకే అంతర్గతం... మేం చూస్తున్నామంతే!: వెంకయ్యనాయుడు
తమిళనాట జరుగుతున్న ఏ పరిణామం వెనుకా బీజేపీ హస్తం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాలు పూర్తిగా ఆ పార్టీ అంతర్గతమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంగా, ఏ రాష్ట్రంలోనూ సంక్షోభం తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమకుందని, అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ మార్పులను పరిశీలిస్తున్నామని తెలిపారు. అధికారులతో మాట్లాడి సమాచారం తెప్పించుకుంటున్నామని, గవర్నర్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తారని చెప్పారు.