: గురుకులాల ఉద్యోగాలలో మహిళలకు అధిక ప్రాధాన్యం.. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత!


తెలంగాణలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిన్న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఇందులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డంతో ఉస్మానియా యూనివ‌ర్సిటీ విద్యార్థులు మండిప‌డుతున్నారు. తొమ్మిది నోటిఫికేషన్ల ద్వారా 7306 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్ర‌క‌టించిన‌ టీఎస్‌పీఎస్సీ అందులో  5వేల పోస్టులను మహిళలకే కేటాయించింది. బోధన, బోధనేతర సిబ్బందిలో మహిళలను ఎంపిక చేయ‌నుంది. ఈ ప్ర‌క‌ట‌న‌ను నిర‌సిస్తూ ఓయూలో నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. గురుకులాల నోటిఫికేషన్‌లో 75 శాతం మహిళలకు కేటాయించటం స‌రికాద‌ని వారు నినాదాలు చేశారు. విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ ర్యాలీని ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

  • Loading...

More Telugu News