: బాలయ్య 'ఎన్టీఆర్' సినిమాలో లక్ష్మీ పార్వతే విలన్!: బొండా ఉమ


హీరో బాలకృష్ణ నటించనున్న ఎన్టీఆర్ సినిమాలో విలన్ లక్ష్మీ పార్వతేనని తెలుగుదేశం నేత బొండా ఉమ అన్నారు. లక్ష్మీ పార్వతి చేతుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే ఏనాడో మూతపడి ఉండేదని అన్నారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా చేస్తున్నట్టు బాలయ్య ప్రకటించిన తరువాత లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

కాగా, ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా చిత్రం ఉంటే సహించేది లేదని, ఆయనకు జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా చూపించాలని లక్ష్మీ పార్వతి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చిత్రంలో చంద్రబాబును హీరోగా చూపిస్తే తాను న్యాయపోరాటానికి దిగుతానని కూడా ఆమె హెచ్చరించారు.

  • Loading...

More Telugu News