: ఇండియాలోని ప్రతి 10 'ఐటీ' ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరమే!: వరల్డ్ బ్యాంక్ నివేదిక


ఇండియాలో ఐటీ ఉద్యోగుల భవిత అగమ్యగోచరంగా ఉందని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో తెలిపింది. ఇప్పటికే ఇంజినీరింగ్ చేసిన విద్యార్థులకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది, విద్య ఉంటే ఎక్స్ పీరియన్స్ లేదని, ఎక్స్ పీరియన్స్ ఉంటే స్కిల్స్ లేవంటూ ఐటీ కంపెనీలు మెలికలు పెడుతున్నాయి. తాజాగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుతో, దేశీయ ఐటీ దిగ్గజాలు సైతం ఆత్మరక్షణలోకి జారుకుంటున్నాయి. ఉద్యోగుల సంఖ్య కంటే కూడా ఆటోమేషన్ పైనే కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి. బీపీవో సేవల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నాయి.

టీసీఎస్, విప్రోలాంటి దిగ్గజ కంపెనీలు కూడా ఉద్యోగులను తగ్గించుకోవడానికి సిద్ధమవుతున్నట్టు వరల్డ్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులకు అవసరమైతే జీతాలు పెంచి, టెక్నాలజీ పరంగా వారికి మరిన్ని బాధ్యతలను అప్పగించాలని ఈ సంస్థలు భావిస్తున్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో, మొత్తం మీద ఇండియాలోని ప్రతి 10 ఐటీ ఉద్యోగాల్లో 7 ఉద్యోగాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అభిప్రాయపడింది. ఆటోమేషన్ విధానం అమల్లోకి వస్తే, ఎంటెక్, బీటెక్ లు పూర్తి చేసుకుని వచ్చే ఇంజినీర్లకు ఉద్యోగాలు దొరకడం దుర్లభంగా మారుతుందని తెలిపింది.

  • Loading...

More Telugu News