: ఒక వ్యక్తితో దేశం నాశనమవుతోందనే దానికి ట్రంప్ నిదర్శనం: సీఎం చంద్రబాబు


ఒక వ్యక్తి వ్యవహార శైలితో దేశం నాశనమవుతోందనే దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిదర్శ నమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రంప్ విధానాలతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోందని, ఆ విధానాలకు వ్యతిరేకంగా మన తెలుగు వాళ్లు కూడా పోరాడుతున్నారని అన్నారు. అమెరికాలో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందని, ఆ దేశంలో ఎక్కడ చూసినా తెలుగు వాళ్లే ఉంటారని అన్నారు. విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని, ప్రభుత్వ ఉద్యోగమే గొప్ప అనే పరిస్థితులు ఇప్పుడు లేవని చంద్రబాబు  అన్నారు.

  • Loading...

More Telugu News