: అమరావతిని కలుపుతూ 106 కి.మీ. రైల్వే మార్గం... రైల్వే బడ్జెట్ లో రూ. 2,680 కోట్లు మంజూరు


నవ్యాంధ్ర రాజధాని అమరావతిని కలుపుతూ 106 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని నిర్మించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే బడ్జెట్ లో ఈ ట్రాక్ నిర్మాణం కోసం రూ. 2,680 కోట్లను కేటాయించారు. వాస్తవానికి 2016-17 బడ్జెట్ లోనే ఈ రైల్వే మార్గం మంజూరయింది. అయితే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ మార్గం కోసం సర్వేను పూర్తి చేసి, ఇటీవలే రైల్వే బోర్డుకు నివేదికను అందించింది. ఈ రైల్వే లైను విజయవాడ-అమరావతి-గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. నాలుగేళ్లలో ఈ మార్గ నిర్మాణం పూర్తవుతుంది. అంతేకాదు ఏపీలోని వివిధ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేటాయింపులు జరిగాయి. శ్రీకాళహస్తి-నడికుడి, బెంగళూరు-కడప, నర్సాపురం-కోటిపల్లి ప్రాజెక్టులకు కూడా నిధులను కేటాయించారు. 

  • Loading...

More Telugu News