: రైల్వే జోన్ పై ప్రకటన వస్తుందని ఆశించాం...నిరాశకు గురయ్యాం: గంటా
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విశాఖపట్టణానికి రైల్వేజోన్ ప్రకటిస్తారని ఆశించామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వివాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ లో రైల్వే జోన్ ప్రకటించకపోవడం పట్ల నిరాశ చెందామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి రైల్వే జోన్ పై అడుగుతామని ఆయన తెలిపారు.