: బడ్జెట్ లో ఏపీకి రైల్వే జోన్...నిరుద్యోగులకు అవకాశాలు లేవు: ప్రొఫెసర్ షారోన్ రాజ్
పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవని ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ షారోన్ రాజ్ తెలిపారు. బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న విశాఖ రైల్వే జోన్ సంగతిని పక్కనపెట్టి, కేంద్రం మరోసారి ఏపీ ప్రజలను మోసం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ కేవలం త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినదిలా కనపడుతోందని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులను కేంద్రం గాలికొదిలేసిందని ఆయన చెప్పారు. పెట్టుబడి దారులకు తప్ప సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ప్రయోజనాలు లేవని ఆయన తెలిపారు.