: సెల్‌ఫోన్ పేలి యువకుడి దుర్మరణం.. బెంగళూరులో ఘటన.. మృతుడు చిత్తూరు వాసి
సెల్‌ఫోన్ పేలి యువకుడు దుర్మరణం పాలైన ఘటన మంగళవారం బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన అనిల్ కుమార్(20) స్నేహితుడితో కలిసి బైక్‌పై మొబైల్ ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. రామ్మూర్తి నగర్ సమీపంలోని బి.చెన్నసంద్ర వద్దకు చేరుకోగానే అనిల్ కుమార్ మాట్లాడుతున్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. తీవ్రగాయాల పాలైన అనిల్ కుమార్ అక్కడే కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు అనిల్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ కుమార్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లికి చెందినవాడని తెలిపారు.