: మూడో సిరీస్‌పై భారత్ గురి.. నేడు ఇంగ్లండ్‌తో చివరి టీ20
తొలి మ్యాచ్‌లో ఓడి, ఉత్కంఠ భరితంగా సాగిన రెండో మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌పై కన్నేసిన టీమిండియా మూడో టీ20కి సిద్ధమైంది. నేడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న చివరి టీ20లో నెగ్గడం ద్వారా ఈ టూర్‌ను క్లీన్ స్వీప్ చేయాలని కోహ్లీసేన భావిస్తోంది. అంతేకాదు, ఈ గెలుపుతో కోహ్లీ ఖాతాలో హ్యాట్రిక్ సిరీస్‌లు చేరుతాయి. మరోవైపు ఈ మ్యాచ్‌లో నెగ్గడం ద్వారా టీ20 సిరీస్‌ను దక్కించుకుని పరువు కాపాడుకోవాలని మోర్గాన్ సేన భావిస్తోంది.
రెండో టీ20లో దాదాపు ఓడిపోయిన మ్యాచ్‌ను బుమ్రా తన మ్యాజిక్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ నేటి వన్డేలో దూకుడు పెంచడం ద్వారా సిరీస్‌ను దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు అందినట్టే అంది చేజారిన విజయాన్ని తలచుకుని ఇంగ్లండ్ జట్టు కుమిలిపోతోంది. సునాయాస విజయం నుంచి ఓటమిలోకి వెళ్లడాన్ని కెప్టెన్ మోర్గాన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. చివరి మ్యాచ్‌ను గెలిచి విజయంతో తిరుగు పయనం అవ్వాలని భావిస్తున్నాడు. సిరీస్ కోసం జరిగే ఈ పోరు క్రికెట్ ప్రేమికులకు పసందైన విందు కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.