: ఏపీ స్పెషల్ స్టేటస్ అంశం ముగిసిన అధ్యాయం: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ అంశం అన్నది ముగిసిన అధ్యాయమని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఏపీకి రావాల్సినవన్నీ సాధిస్తామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై 15 రోజుల్లోగా చట్టబద్ధత కల్పిస్తామని ఆయన ప్రకటించారు. వైఎస్సార్సీపీ నేతలు కొండమీద కోతిని తెమ్మంటే మాత్రం తీసుకురాలేమని ఆయన చెప్పారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ నేతలు రాజీనామా చేస్తామంటే చేసుకోనివ్వండని ఆయన అన్నారు. ఏపీకి రైల్వేజోన్, పోలవరం నిధులు, ప్యాకేజీలో పేర్కొన్న ఇతర నిధుల గురించి కేంద్రాన్ని అడుగుతామని ఆయన తెలిపారు.