: ఆ ఒక్క పనీ చేయండి... అప్పుడైనా ఎదుగుతాం: ట్రంప్ కు మాజీ క్రికెటర్, పాక్ నేత ఇమ్రాన్ ఖాన్ కోరిక


పాకిస్థాన్ పై కూడా వీసా ఆంక్షలను విధించనున్నట్టు వైట్ హౌస్ నుంచి వెలువడిన సంకేతాలపై మాజీ క్రికెటర్, పాక్ రాజకీయనాయకుడు ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. "పాకిస్థాన్ కూడా యూఎస్ వీసా ఆంక్షలను ఎదుర్కోనుందని విన్నాను. పాకిస్థానీలకు వీసాల జారీని నిలుపుదల చేయాలని నేను ట్రంప్ ను ప్రార్థిస్తున్నాను. అప్పుడైనా దేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది" అని అన్నారు. అమెరికా తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా పాక్ నిర్ణయాలుంటాయని, ఇరాన్ చెప్పినట్టుగానే అమెరికన్లు పాక్ భూభాగంపై కాలు మోపకుండా నిషేధాజ్ఞలు విధిస్తామని ఆయన అన్నాడు.

లాహోర్ కు 250 కిలోమీటర్ల దూరంలోని సాహివాల్ ప్రాంతంలో ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఇమ్రాన్, నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. తలనొప్పి వచ్చినా చికిత్స కోసం విదేశాలకు వెళుతున్న నవాజ్, ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. పాకిస్థానీలపై యూఎస్ నిషేధం విధిస్తే, కనీసం అప్పుడైనా నవాజ్, దేశాభివృద్ధిపై దృష్టిని సారిస్తారని అనుకుంటున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News