: పాక్ కెప్టెన్ ను మార్చాల్సిందేనంటున్న సెలెక్టర్లు!

పాకిస్థాన్ జట్టును ప్రక్షాళన చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలెక్టర్లు భావిస్తున్నారు. ఆసీస్ పర్యటనలో పాక్ జట్టు ఊహించిన ఫలితాలు సాధించడంలో విఫలమైనందున జట్టులో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది. 2019 వరల్డ్ కప్ లో జట్టు ఆడాలంటే తొలి 8 స్థానాల్లో ఉండాలి. ప్రస్తుతం పాక్ జట్టు వన్డే ర్యాంకు 8. దీంతో అదే స్థానంలో కొనసాగితే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఇతర చిన్న జట్లతో సుదీర్ఘ మ్యాచ్ లు ఆడి టాప్ టూలో నిలిస్తే అప్పుడు వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వన్డే వరల్డ్ కప్ లో స్థానంపై ఆశలు వదులుకోవాల్సిందే.

 ఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ అజహర్ అలీ వ్యక్తిగత ప్రదర్శన బాగున్నప్పటికీ జట్టుగా ప్రదర్శన రాబట్టడంలో విఫలమయ్యాడని పీసీబీ భావిస్తోంది. అందుకే అతని స్థానంలో టీ20 కెప్టెన్ సర్ఫరాజ్ ను నియమించే యోచనలో ఉన్నారు. మూడు ఫార్మాట్లకు ఒక్కడే కెప్టెన్ ను నియమించడం ద్వారా మంచి ప్రదర్శన రాబట్టవచ్చని భావిస్తున్న పీసీబీ, టెస్టుకెప్టెన్ గా ఉన్న మిస్బాను తొలగించే సాహసం చేయలేదు. దీంతో టెస్టు మినహా వన్డే, టీ20లకు సర్ఫరాజ్ ను నియమించే అవకాశం ఉంది. 

More Telugu News