: బడ్జెట్ ప్రభావంతో స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ఉండటంతో... ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో, ఈరోజు ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు అస్థిరంగా కొనసాగి, చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 27,117కు చేరుకుంది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 8,392 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్...
బీఈఎంఎల్ లిమిటెడ్ (6.40%), యునైటెడ్ స్పిరిట్స్ (6.02%), హిందాల్కో ఇండస్ట్రీస్ (5.75%), ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (5.73%), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (5.15%).
టాప్ లూజర్స్...
పిరమల్ ఎంటర్ ప్రైజెస్ (-4.15%), దివీస్ ల్యాబ్ (-3.75%), అమరరాజా బ్యాటరీస్ (-3.34%), జెఎస్ డబ్ల్యూ ఎనర్జీ (-3.10%), పెర్సిస్టెంట్ సిస్టమ్స్ (-2.99%)