: ఏపీలో పర్యటించనున్న కేసీఆర్... షెడ్యూల్ ఖరారు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో ఈ నెల 30న పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. విజయవాడ, తిరుపతి నగరాలకు ఆయన వెళ్లనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే, కనకదుర్గమ్మకు, వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక ఆభరణాలు చేయిస్తానని కేసీఆర్ మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొక్కులు తీర్చుకునేందుకు ఆయన రానున్నారు. తిరుమల వెంకన్నకు రూ. 5 కోట్ల విలువైన మూలవర్ణ కమల నమూనా బంగారు సాలిగ్రామ హారం, ఐదు పెటల కంఠాభరణం, తిరుచానూరు పద్మావతి దేవికి రూ. 30 నుంచి రూ. 45 వేల మధ్య 15 గ్రాముల బంగారు ముక్కుపుడక, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రూ. 30 నుంచి రూ. 45 వేలతో 15 గ్రాముల బంగారు ముక్కుపుడకలను కేసీఆర్ చెల్లించుకోనున్నారు. రెండేళ్ల క్రితం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన వేళ కనకదుర్గమ్మను కేసీఆర్ సందర్శిస్తారని భావించినా, సమయాభావం వల్ల వెళ్లలేకపోయారు.

  • Loading...

More Telugu News