: నా బలం.. నా జీవితపు వెలుగు నువ్వే !: ప్రిన్స్ మహేష్ బాబు


తన భార్య నమ్రత పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభినందనలు తెలిపాడు. తన ప్రేమను తెలియజేసేందుకు ట్విట్టర్ ఖాతాను ఎంచుకున్నాడు. నమ్రత ఫోటోను ట్వీట్ చేస్తూ, "నా బలం, నా జీవితంలో వెలుగు నువ్వే. హ్యాపీ బర్త్ డే టూ మై డియరెస్ట్ వైఫ్" అని ట్వీట్ చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్, నమ్రతల జంట ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచింది. ఈ ఉదయం 9 గంటల సమయంలో పెట్టిన ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

  • Loading...

More Telugu News