: ఏపీ రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయం దేశానికి తెలియాలి: వైఎస్ జగన్
ఏపీ రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయం దేశ మంతటా తెలియాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న ఆయన, నిడమర్రులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ సేకరణ పేరుతో రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని జగన్ విమర్శించారు. రూ.15 కోట్లు పలికే ఎకరం భూమికి రూ.30 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని, కమిషన్ల కోసం ఏపీ రాజధాని నిర్మాణాన్ని పక్కన పెట్టారని ఆరోపించారు. పెనుమాక, ఉండవల్లి, నవులూరు, ఎర్రబాలెం గ్రామాలకు తనను వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారని జగన్ మండిపడ్డారు.