: జియోపై మరింత వెచ్చించనున్న అంబానీ.. ప్రత్యర్థుల పోటీని తట్టుకునేందుకు 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడి
రిలయన్స్ జియోపై మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముకేశ్ అంబానీ సిద్ధమయ్యారు. మార్కెట్లో ఇతర నెట్‌వర్క్‌ల నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థంగా తట్టుకునేందుకు మరో 4.4 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు. జియో నెట్‌వర్క్‌పై 25 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టి మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించిన ముకేశ్ జియో స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రైట్స్ ఆఫర్ ద్వారా ఈ మొత్తాన్ని సేకరించాలని నిర్ణయించినట్టు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. జియోలో ప్రస్తుతం 7.24 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారని, ప్రతి రోజు కొత్తగా 6 లక్షల మంది జియోలోకి మారుతున్నారని సంస్థ పేర్కొంది.