: సూపర్ ఫీచర్లతో రానున్న నోకియా 8... ఆన్ లైన్లో లీకైన స్పెసిఫికేషన్స్!
నోకియా 6 మార్కెట్లోకి విడుదలైన కొద్ది రోజులకే, తదుపరి రానున్న నోకియా 8 గురించిన న్యూస్ ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో తొలిసారి ఈ ఫోన్ ను బయటకు చూపుతారన్న అంచనాలుండగా, దీని గురించిన వీడియోలు 'టోటల్ టెక్' నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్ లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫోన్ రెండు రకాల వేరియంట్లలో లభిస్తుందని తెలుస్తోంది. అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 835 ఎస్ఓసీ ప్రాసెసర్ తో కూడిన 6 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకత. ఆప్టికల్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ తో 24 ఎంపీ రేర్ కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ముందు వైపు రెండు స్పీకర్లతో లభిస్తుందని సమాచారం. 64 జీబీ, 128 జీబీ అంతర్గత మెమొరీతో ఇవి రెండూ ఉంటాయని తెలుస్తోంది. స్క్రీన్ కింద ఎలాంటి ఫిజికల్ బటన్స్ ఇందులో కనిపించడం లేదు. చూడటానికి ఇటీవల విడుదలైన నోకియా 6 మాదిరిగానే ఉన్నట్టు టెక్ నిపుణులు వ్యాఖ్యానించారు.