: 2019లో పవన్ కల్యాణ్ కు ఆశాజనకంగా ఉండదనుకుంటున్నా: జేసీ దివాకర్ రెడ్డి
2019లో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఆశాజనకంగా ఉండదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో పారిశ్రామిక వేత్త పుట్ట గుంట సతీష్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు పవన్ టెంపర్ మెంట్, ఆయనకు ఉన్నశక్తి చాలదని, తాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడటం మంచిది కాదని అన్నారు. సినిమా హీరోలకు ఓట్లేసే పరిస్థితి తగ్గిపోయిందన్నారు. ఎంతో గ్లామర్ ఉన్న ఎన్ టి రామారావు, జయలలితకు మాత్రమే ప్రజలు ఓట్లు వేశారని, ఓట్లు వేయించుకునే అంతటి గ్లామర్ ఇప్పుడు ఉన్న నటులకు లేదని అన్నారు.