: ఆ డైలాగ్ కు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు: బాలకృష్ణ


‘దేశం మీసం తిప్పుదాం’ అనే డైలాగ్ కు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ థియేటర్ లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చూసిన అనంతరం బాలయ్య మాట్లాడుతూ, తాము ఊహించిన దాని కంటే భారీ విజయం దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండగ ముందుగానే వచ్చిందని, తమ చిత్రానికి విదేశాల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఈ చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చిన ఇరు రాష్ట్రాల సీఎంలకు బాలకృష్ణ తన కృతఙ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News