: నమ్మకం కలగడం లేదు... 79 రోజుల్లో ఇటువంటి చిత్రమా? నేనింకా నేర్చుకోవాలి!: రాజమౌళి ప్రశంసల వర్షం


బాలయ్య వందవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఉదయమే సినిమా చూసిన ఆయన, తన ట్విట్టర్ ఖాతాలో వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. "ఈ కథను 79 రోజుల్లో ఇంత అద్భుతంగా ఎలా తీశారు? నమ్మశక్యం కావడం లేదు. మీ నుంచి నేను ఎంతో ఎంతో నేర్చుకోవాలి. సాయి మాధవ్... నీ కలమే శాతకర్ణి ఖడ్గం. అద్భుతమైన కెమెరా పనితనం, అత్యద్భుతమైన నిర్మాణ విలువలు శాతకర్ణి చిత్రాన్ని సుదీర్ఘకాలం పాటు గుర్తుండిపోయేలా చేశాయి. ఈ చిత్రం తెలుగు పరిశ్రమకు గర్వకారణం" అని ఆయన ట్వీట్ చేశారు.


  • Loading...

More Telugu News