: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై యోగేంద్ర యాదవ్ విసుర్లు.. చోటా మోదీలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్ ఢిల్లీ సీఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీలాగే కేజ్రీవాల్ కూడా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీనియర్లను పక్కనపెట్టి పార్టీని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్నందుకు తనను, ప్రశాంత్ భూషణ్‌ను బయటకు వెళ్లగొట్టారని ధ్వజమెత్తారు. మోదీలాగే కేజ్రీవాల్ కూడా పార్టీలో ఎవరితోనూ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో అంతా తానై వ్యవహరిస్తుండడం ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని యోగేంద్ర పేర్కొన్నారు.