: రిలీజైన వెంటనే ఇంటర్నెట్లో లీకైన 'ఖైదీ నంబర్ 150' పాట
పైరసీపై ఎంతగా పోరాటం చేస్తున్నా... ఫలితం మాత్రం దక్కడం లేదు. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 'ఖైదీ నంబర్ 150' అలా విడుదలైందో లేదో... వెంటనే అందులోని ఓ పాట నెట్టింట్లో ప్రత్యక్షమైంది. 'సన్న జాజిలా పుట్టేసిందిరో... మల్లె తీగలా చుట్టేసిందిరో' అనే పాట ఇప్పుడు ఇంటర్నెట్ లో లీకై, వైరల్ అవుతోంది. దీనిపై సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎంతో కష్టపడి సినిమా తీస్తే... నిమిషాల వ్యవధిలోనే ఆన్ లైన్లో ప్రత్యక్షమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి.